October 04, 2015

ULAVA MOLAKALU TO SAMBAR

                      ఉలవ మొలకలు తో సాంబారు 

కావలిసిన వస్తువులు :
ఉలవలు - 250 గ్రా 
పచ్చి కొబ్బరి - 1/2
ఎండు కొబ్బరి - 1/4
పసుపు - 1/4 tsp 
ధనియాలు - 4 tsp 
మిరియాలు - 10
జీలకర్ర - 1/4 tsp 
మెంతులు - 1/4 tsp 
ఉల్లిపాయలు - 4
చింతపండు - 20 గ్రా 
బెల్లం - 20 గ్రా 
ఉప్పు 
గసగసాలు - 4 tsp 
ఆవాలు - 1/2 tsp 
నెయ్యి - 4 tbsp 
కొత్తిమీర 
కరివేపాకు 

తయారీ:

  • ఉలవలు  నీటిలో సాయం కాలం నాన పెట్టి, ఉదయం నీటిని వంచి గుడ్డలో మూట కట్టి ఉంచితే మరుసటి రోజుకి మొలకలు వస్తాయి. 
  • ఎండు  కొబ్బరి, 2 ఉల్లిపాయలు పొయ్యి మీద కాల్చి పక్కన పెట్టుకోవాలి. 
  • చింతపండు నాన పెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. 
  • పొయ్యి మీద గిన్ని పెట్టి నెయ్యి వేసి మరిగిన తరువాత ఆవాలు, కరివేపాకు వేసి, ఒక ఉల్లిపాయ ముక్కలుగా తరిగి వేయవలెను. 
  • ఉలవ మొలకలు కూడా వేసి సన్నని సెగ మీద 5 ని వేయించవలెను. 
  • వేగిన తరువాత 1 లీటర్ నీలు పోసి కలియపెట్టి మూత పెట్టవలెను. 
  • ధనియాలు, గసగసాలు, కాల్చి ఉంచిన కొబ్బరి ముక్క, పసుపు, కాల్చి ఉంచిన ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి,   మిగిలిన ఉల్లిపాయ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • ఈ ముద్దలో బెల్లం, చింత పండు పులుసు, ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. 
  • ఉఅవ మొలకలు  ఉడికిన తరువాత ఈ మిశ్రమం వేసి, ఇంకా నీళ్ళు పోసి ఉడికించాలి. 
  • తయారయిన సాంబార్ 2 లీటర్  అయ్యేలా మరిగించాలి.
  •  ఇది అన్నం లోకి రుచిగా ఉంటుంది

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0