September 21, 2016

PESARATTU

పెసరట్టు  

కావలిసిన వస్తువులు:
పెసలు - 250 గ్రా 
బియ్యం - 50 గ్రా 
 పచ్చిమిర్చి - 5-6
అల్లం -  చిన్న ముక్క 
జీలకర్ర - 1/2 tsp 
ఉప్పు 
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్ (సన్నగా)
నెయ్యి/నూనె 

తయారీ:

  • పెసలు, బియ్యం కలిపి 2-3 గంటలు నానపెట్టుకోవాలి. నానిన తరువాత కడిగి అల్లం, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • రుబ్బిన పిండిలో జీలకర్ర వేసి కలుపుకోవాలి. 
  • పెనం మీద గరిటెడు పిండి దోశలాగా వేసుకొని మధ్యలో ఉల్లిపాయ ముక్క చల్లి చుట్టూ నెయ్యి కానీ నూనెగాని వేసి కాలిన తరువాత వేడిగా అల్లం పచ్చడితో గాని వేరే పచ్చడితో వడ్డించాలి. 


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0