September 21, 2016

SOJJA BHAKSHYALU

సొజ్జ భక్ష్యాలు 

కావలిసిన వస్తువులు:
మైదా - 250 గ్రా 
బొంబాయి రవ్వ - 250 గ్రా 
పంచదార  - 250 గ్రా 
ఏలకులు - 10
నెయ్యి 

తయారీ:

  • మైదా పిండి జల్లించి ఒక చెంచా నెయ్యి వేసి సరిపడా నీళ్లు పోసి పూరీలా పిండిలా కలిపి మర్దన బాగా చెయ్యాలి. 
  • ఒక గిన్నిలో 600 ml నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. 
  • రవ్వ ఉడికిన తరువాత పంచదార వేసి బాగా కలిపి రెండు చెంచాలు నెయ్యి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గిర పడిన తరువాత దించి చల్లారనివ్వాలి. 
  • మైదా పిండిని సుమారుగా 25 ఉండలు చేసుకొని వాటిని పూరిలాగా చేసి అందులో బొంబాయి రవ్వ పూర్ణాన్ని పెట్టి  మల్లి ఈ పూరీని మూసి నెయ్యి చేతితో వత్త్తి పూరిలాగా చేసుకోవాలి. 
  • వీటిని పెనం మీద వేసి నేతితో దోరగా కాలనిచ్చి తీసుకోవాలి. 
  • ఇవి రెండు రోజులు నిల్వ ఉంటాయి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0