October 23, 2016

PEETHALA PULUSU

  పీతల పులుసు

కావలిసిన వస్తువులు:
పీతలు  - 1 కిలో
మజ్జిగ- 1 గ్లాస్
చింత పండు పులుసు - సరిపడా
ఉప్పు
పసుపు
కారం - 1 tbsp
ఉల్లిపాయలు - 2

తడి మసాలా :
ఉల్లిపాయలు  -3
పచ్చిమిర్చి - 6
అల్లం- ఒక ముక్క
వెల్లులి - 2 పాయలు
కొబ్బరి ముక్క - 1
గసగసాలు - 2 tsp

పొడి మసాలా:
ధనియాలు - 2 tsp
ఏలకులు - 2
లవంగాలు - 4
దాల్చిన చెక్క -3


తయారీ:

  •  తడి మసాలా కు కావలిసిన వస్తువులు   మెత్తగా రుబ్బుకోవాలి. 
  • ధనియాలు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేయించి పొడి కొట్టుకోవాలి. 
  • పీతలు కాళ్ళు తీసేసి, పైన పెచ్చులు తీసి, ముక్కలు కోసి, శుభ్రంగా కడిగి, ఉప్పు, పసుపు, మజ్జిగతో బాగా కడగాలి. 
  •  కడిగిన ముక్కలకు తడి మసాలా బాగా పట్టించుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేయుంచుకోవాలి. వేగిన తరువాత పీత ముక్కలు మాసాలతో  కలిపి వేసి వేయించాలి. 
  • నీళ్లు సరిపడా పోసి ఉడికించాలి. 
  • పీతలు చాలా ఆలస్యంగా ఉడుకుతాయి. ముక్క మెత్తగా ఉడికిన తరువాత చింతపండు పులుసు, కారం ఉప్పు, పసుపు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. 
  • చివరకు పొడి మసాలా, కొత్తిమీర వేసి రెండు నిముషాలు మగ్గనిచ్చి దించుకోవాలి. 




No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0